మీరు రోజు పాలు తాగుతున్నారా! అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాలి

ప్రతిరోజు పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న పోషకాల గురించి తెలిసిన వాళ్ళు తాగకుండా ఉండలేరు. చాలామంది టీ, కాఫీలు తాగకుండా కేవలం పాలను మాత్రమే తాగుతారు. అయితే పాలను తాగటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పాలు అధికంగా తాగడం వల్ల ప్రాణహాని ఉందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. పాలలో ప్రొటీన్లు, విటమిన్లు కాల్షియం, విటమిన్ బి 12, విటమిన్ డి,, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని పాలుతాగడం చాలా మంచిదని కాల్షియం కావాల్సినంత అందుతుంది కాబట్టి పాలు ఎన్ని తాగిన పర్వాలేదనుకుంటారు.

పాలు తాగడం వల్ల వచ్చే సమస్యలు:

రోజుకు అర్ధ లీటర్ పాల కంటే ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, దీని వల్ల త్వరగా ప్రాణాలు కోల్పోతారని తాజా పరిశోధనలో తేలింది. పాలు అధికంగా తాగడం వల్ల పురుషుల్లో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు అయినప్పుడు పలు తాగడం మానేయ్యాలి. కొంతమందికి పాలు తాగడం వల్ల పలు రకాల చర్మ సమస్యలు వస్తాయని, అలాగే పాలు అధికంగా తాగడం వల్ల ఎముకలకు కలిగే లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అధికంగా పాలు తాగడం వల్ల స్త్రీలలో పలు రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. పాలు అధికంగా తాగడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి పాలు తాగడం తగ్గించి, పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. ఏదైనా తగినంత మోతాదులో ఉంటేనే మంచిది. అతిగాచేస్తే ఏదైనా ప్రమాదమే కాబట్టి పాలను కుడా తగిన్నంత తీసుకుంటూ ఆరోగ్యముగా ఉండండి.