ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనుకోవాలా.? ఏమో, అంతేనేమో.! కానీ, పైకి గట్టి ఆ విషయం చెప్పలేకపోతున్నాడు. ఇంతకీ, ఎవరా మెగా హీరో.? నిప్పు లేకుండా పొగ అయితే పుట్టదు.! కానీ, ఈ రోజుల్లో నిప్పు లేకుండా కూడా పొగ పుట్టేస్తుంది.! అంతేనా.? అక్కడ అస్సలు విషయం లేకుండానే, ఆ మెగా హీరో, ‘పెళ్ళి విషయమై’ గాసిప్స్ కాలమ్స్‌లోకి ఎక్కుతున్నాడా.?
ఈ మధ్యనే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది సినీ నటి లావణ్య త్రిపాఠితో. మరో మెగా హీరో కూడా తొందరపడాల్సిన పరిస్థితి. ఆయన తొందరపడకపోయినా, తొందరపడేలా చేస్తున్నారట. తప్పదు, అనౌన్స్ చేసెయ్యాల్సిందేనన్న ఒత్తిడి పెరిగిందట. ఓ నటితో ప్రేమలో పడ్డాడట ఆ మెగా హీరో. కాదు కాదు, పరిశ్రమతో సంబంధం లేని అమ్మాయితో ప్రేమ.. డేటింగ్.. అని కూడా అంటున్నారు.
ఎవరా మెగా హీరో.? ఏమా కథ.? ఈ నెలాఖరులోనే ఓ స్పష్టత వచ్చే అవకాశముందట అన్ని విషయాల మీదా.!