నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాతపరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం సాధించే ఛాన్స్ ను కల్పించింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎఫ్.ఎల్.సీ కన్సల్టెంట్/కౌన్సిలర్, వాచ్‌మెన్/గార్డెనర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

bankofbaroda.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం రెండు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఎఫ్.ఎల్.సీ కౌన్సిలర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కనీసం ఏడో తరగతి పాసైన వాళ్లు వాచ్‌మన్/గార్డెనర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

కౌన్సెలర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవాన్ని కలిగి ఉండాలి. 64 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. గార్డెనర్ పోస్టుకు 22 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.