Tollywood: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటిపోయినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్నా. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది తమన్నా. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కొద్దిరోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వీరికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఎక్కడికి వెళ్లినా కూడా చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. చూడ చక్కనైన జంట అందంగా ఉన్నారు త్వరలోనే పెళ్లి పీటలలో ఎక్కబోతున్నారు అని ఆశ పడ్డ అభిమానులకు ఊహించని ఇచ్చారు ఈ జంట. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
ఈ బ్రేకప్ వార్తలు వినిపించిన తర్వాత ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చే విధంగా చాలా ఈవెంట్లో విడివిడిగా కనిపించారు. అలాగే బ్రేకప్ వార్తల తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించిందే లేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారని ఫ్యాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే విజయవర్మకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే హీరోయిన్ తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ ఇప్పుడు మరొక హీరోయిన్ తో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. కాగా ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్. దంగల్ సినిమాతో ఈ చిన్నది బాగా పాపులర్ అయ్యింది. ఇటీవలే ఈ విజయ్ వర్మ, ఫాతిమా సన షేక్ లంచ్ కు వెళ్లిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో విజయ్ ను టైట్ గా హగ్ చేసుకోవడం, అతనికి ముద్దు పెట్టడం, అంతే కాకుండా ఫోటో గ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్న కూడా అతనితో క్లోజ్ గా పోజులిచ్చింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై విజయ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..