న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. డిగ్రీ, బీటెక్ అర్హతతో 450 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. newindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కేల్ 1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా సెప్టెంబర్ నెల 9వ తేదీన ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష 2023 సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన ఫేజ్ 2 పరీక్ష జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ 120 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆటోమొబైల్ ఇంజనీర్ 96 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. లీగల్ ఉద్యోగ ఖాళీలు 70 ఉండగా అకౌంట్స్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయని తెలుస్తోంది.
ఐటీ ఉద్యోగ ఖాళీలు 23 ఉండగా హెల్త్ ఉద్యోగ ఖాళీలు 75, రిస్క్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 36 ఉన్నాయి. కొన్ని ఉద్యోగ ఖాళీలకు పీజీ కూడా అర్హతగా ఉన్న నేపథ్యంలో అర్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు కాగా రిజర్వ్డ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 80,000 రూపాయల వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.