ప్రస్తుత రోజుల్లో నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. ఉద్యోగాలు చేసే వారితో పోల్చుకుంటే నిరుద్యోగుల సంఖ్యని ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వం ప్రవేట్ ఎన్నో రకాల జాబులను విడుదల చేసినప్పటికీ అందులో కేవలం కొద్ది మందికి మాత్రమే జాబులు వస్తున్నాయి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే మీరు కూడా జాబుల కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా. ఇది ఈ వార్త మీ కోసమే.. నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గేట్ క్వాలిఫై అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 30తో ముగుస్తుంది. పోస్టుల విషయానికొస్తే.. NPCIL మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ వంటి విభాగాల్లో మొత్తంగా 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఖాళీలను భర్తీ చేస్తుంది. మెకానికల్- 150, కెమికల్ 73, ఎలక్ట్రికల్- 69, ఎలక్ట్రానిక్స్- 29, ఇన్‌స్ట్రుమెంటేషన్- 19, సివిల్ విభాగంలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు భర్తీ కానున్నాయి. కాగా దరఖాస్తుదారుల వయసు 2024 ఏప్రిల్ 30 నాటికి 26 ఏళ్లు మించకూడదు. అయితే ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా మూడేళ్లు, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సండలింపు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేసన్ విషయానికి వస్తే..
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ , బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే దీనిని అప్లై చేసుకోవడానికి ముందు NPCIL అధికారిక పోర్టల్ npcilcareers.co.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి కెరీర్స్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి. అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థుల ఎంపికలో గేట్ స్కోర్, ఇంటర్వ్యూ కీలకం. ముందుగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో గేట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.55,000 ఉంటుంది. దీంతోపాటు వన్ టైమ్ బుక్ అలవెన్స్ రూ.18,000 లభిస్తుంది.