కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. పత్తి సేకరణ, బిజినెస్, మార్కెటింగ్‌పై దృష్టి పెడుతున్న ఈ సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. cotcorp.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జులై 24వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆగష్టు నెల 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 93 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 81 ఉండగా మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్) ఉద్యోగ ఖాళీలు 6, మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్) ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ పాసైన వాళ్లు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఎంబీఏ పాసైన వాళ్లు మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) ఉద్యోగ ఖాళీలకు అర్హులు. కామర్స్‌, ఫైనాన్స్‌లో పీజీ పూర్తిచేసిన వాళ్లు మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్) ఉద్యోగాలకు అర్హులు.

వెబ్ సైట్ లో సీసీఐ రిక్రూట్‌మెంట్-2023 అనే లింక్‌పై క్లిక్ చేసి రిజిష్టర్ కావడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలుగా ఉండనుంది.

మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 22,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.