కేంద్రం సూపర్ స్కీమ్.. సొంతింటి కలను సులువుగా నెరవేర్కుకునే అద్భుతమైన ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ గురించి అవగాహన కలిగి ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా సొంతింటి కలను సులభంగా నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సొంతంగా స్థలం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ స్కీమ్ యొక్క నియమనిబంధనలను పూర్తిగా తెలుసుకుని అన్ని అర్హతలు ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్లు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు సైతం ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేరు.

మోటార్ సైకిల్ ఉన్నా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యం కాదు. ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ కు నియమనిబంధనలు ఎక్కువగా ఉన్నాయి. పీఎం ఆవాస్ యోజన వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా సులువుగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

సొంతింటి స్థలం ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు కనీస వసతులతో ఇళ్లను నిర్మించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా 112.25 లక్షల ఇళ్ల పనులను ప్రారంభించింది. అర్హత కలిగిన వారు పట్టణ ప్రాంతాలలో సైతం ఇంటిని నిర్మించుకునే ఛాన్స్ ఉండటంతో ఈ స్కీమ్ ద్వారా మేలు చేకూరనుంది.