మన దేశంలో చాలామంది డబ్బును బదిలీ చేయడానికి ఎక్కువగా గూగుల్ పే, ఫోన్ పే, ఇతర యాప్స్ పై ఆధారపడుతున్నారు. ఈ యాప్స్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కస్టమర్ కేర్ ను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవచ్చు. అయితే గూగుల్ పే యాప్ వాడేవాళ్లు సులువుగా లోన్ కూడా పొందవచ్చు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
గూగుల్ పే యాప్ ద్వారా ఏకంగా 8 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సులువుగా పర్సనల్ లోన్ పొందాలని భావించే వాళ్లకు గూగుల్ పే బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ప్రముఖ లెండింగ్ ఫ్లాట్ ఫామ్స్ సహాయంతో గూగుల్ పే ఈ రుణాలను అందిస్తోంది. అందువల్ల అత్యవసరం ఉన్నవాళ్లు మాత్రమే ఈ విధంగా రుణాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
రీ పేమెంట్ కెపాసిటీ, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాన్ని పొందే అవకాశం నిర్ధారించబడుతుంది. గూగుల్ పే యాప్ లో డీ.ఎం.ఐ ఫైనాన్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా సులభంగా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 10వేల నుంచి ఈ లోన్ ప్రారంభమైంది. నెలవారీ చెల్లింపుల విధానంలో ఈ మొత్తాన్ని చెల్లించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కనిష్టంగా 6 నెలల టెన్యూర్ తో ఈ రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాన్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా లోన్ కు అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ లోన్ కు వడ్డీ బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది.