గూగుల్ పే వాడేవాళ్లకు అదిరిపోయే తీపికబురు.. సులువుగా రూ.1000 క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్!

మనలో చాలామంది కచ్చితంగా ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటనే సంగతి తెలిసిందే. గూగుల్ పే ద్వారా సులువుగా డబ్బులను ఇతరులకు పంపడంతో పాటు ఇతరుల నుంచి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. అయితే గూగుల్ పే మొదట్లో భారీ స్థాయిలో క్యాష్ బ్యాక్ లు ఇచ్చినా ఇప్పుడు మాత్రం ఆశించిన స్థాయిలో క్యాష్ బ్యాక్ లు రావడం లేదనే సంగతి తెలిసిందే. గూగుల్ పే ప్రస్తుతం వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

అయితే తాజాగా గూగుల్ పే వాడే ఒక వ్యక్తికి ఏకంగా 567 రూపాయల క్యాష్ బ్యాక్ లభించడం గమనార్హం. మరి కొందరికి 1000 రూపాయలకు అటూఇటుగా క్యాష్ బ్యాక్ లభించినట్లు తెలుస్తోంది. గూగుల్ పే యాప్ ను వాడేవాళ్లు ఈ యాప్ ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపితే మాత్రం ఈ బెనిఫిట్స్ ను సులువుగా పొందే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసొస్తే మీరు కూడా భారీగా క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ ఉంది.

గతంలో లక్షరూపాయల వరకు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వగా ప్రస్తుతం ఒకింత పరిమితంగానే గూగుల్ పే క్యాష్ బ్యాక్ లను అందిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. గూగుల్ పే యాప్ ను ఉపయోగించే వాళ్లు క్యాష్ బ్యాక్ గురించి ఆలోచించకుండా ఎక్కువ మొత్తం లావాదేవీలు జరిపితే మంచిదని చెప్పవచ్చు. ఫోన్ పే కూడా గతంలో క్యాష్ బ్యాక్స్ ఇచ్చినా ఇప్పుడు క్యాష్ బ్యాక్స్ ఇవ్వడం లేదు.

గూగుల్ పే ద్వారా ఎక్కువమందికి బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనే స్క్రాచ్ కార్డ్ వస్తుండటం గమనార్హం. గూగుల్ పే ఇచ్చే కొన్ని డిస్కౌంట్ల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. గూగుల్ పే క్యాష్ బ్యాక్ లను ఇస్తే మాత్రం కోట్ల సంఖ్యలో కస్టమర్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.