ఇప్పుడు మీ క్రెడిట్ స్కోర్ వాట్సప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు తెలుసా?

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్ తీసుకోవాలన్న , తక్కువ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ పొందాలన్నా క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమనేది చెప్పక్కర్లేదు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్ కి ఉన్న వడ్డీ రేట్లలో డిస్కౌంట్ లభిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ పెంచడానికి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

అయితే ఇపుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మన మొబైల్ ఫోన్ లో ఉన్న వాట్స్అప్ ద్వారా క్రెడిట్ స్కోర్ సులభంగా చెక్ చేయవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డేటా అనలిటిక్స్ అండ్ డెసిషన్ ఆర్గనైజేషన్ ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్‌ లోనే ఫ్రీగా క్రెడిట్ స్కోర్‌ రిపోర్ట్స్‌ను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. దీనితో క్రెడిట్ స్కోర్ రిపోర్టు పొందాలనుకునే వారు సులభంగా దీని ద్వారా క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకోవచ్చు.

వాట్సప్ ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవటానికి

• మొదటగా ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ నంబర్ +91-9920035444 ని మీ ఫోన్ లో సేవ్ చేసి ఉంచండి.
• ఆ తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్ కి ‘Hi’ అని మెసేజ్ పంపి మీ పేరు, రిజిస్టర్డ్‌ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలని తెలియచేయాలి.
• ఇలా రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పాస్‌వర్డ్-ప్రొటెక్షన్‌తో ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్ట్ చెయ్యాలి. అతి తక్కువ సమయంలో చాలా సులభంగా , సురక్షితంగా మీరు క్రెడిట్ రిపోర్ట్ పొందొచ్చు.