ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారిపోయింది. రైతుల దగ్గరి నుండి వ్యాపారం చేసే వారి వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు జరపటానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపే వారికి, బ్యాంకుల్లో రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకునేవారికి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే వారికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. గతంలో సిబిల్ స్కోర్‌ను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందరు సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలని చూస్తున్నారు.
అయితే అప్పుడప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేయటం చాలా అవసరం. అయితే సిబిల్ స్కోర్ చెక్ చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునే ఆప్షన్ ని పలు సంస్థలు ఫ్రీగానే ఇస్తున్నాయి. ట్రాన్స్ యూనియన్ సంస్థ కూడా ఏడాదికి ఒక సారి ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ముఖ్యంగా గూగుల్ పే ఉపయోగిస్తున్నా వినియోగదారులు మరింత సులభంగా ఉచితంగా వారి సిబిల్ స్కోర్ చెక్ చేయవచ్చు. ఇక గూగుల్ పే నుండి సిబిల్ స్కోర్ ని ఎలా పొందొచ్చు అనేది చూసేద్దాం.
• గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ముందుగా గూగుల్ పే ఓపెన్ చేయాలి.
• ఆ తర్వాత అక్కడ ఉన్న Manage Your Money సెక్షన్ లో చెక్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత పాన్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ని ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే ట్రాన్స్‌యూనియన్ దగ్గర ఉన్న మీ డేటా ప్రకారం
సిబిల్ స్కోర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
• ఒకవేళ రాలేదు అంటే మీరు ఎలాంటి రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదని అర్థం.