ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహేంద్ర ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ని మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మహేంద్ర నుండి మార్కెట్లోకి విడుదలైన థార్ ఎస్‌యూవీ ప్రజలను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ పాపులర్ కారు థార్ ఎస్‌యూవీ ని సొంతం చేసుకుంటున్నారు. అయితే థార్ కస్టమర్లకు మహేంద్ర ఇటీవల ఒక శుభవార్త తెలియజేసింది. థార్ ఇపుడు కొత్త రంగుల్లో వినియోగ దారులకు అలరించనుంది. ఇప్పటి వరకు థార్ (4X2 RWD)వెర్షన్‌లకు మాత్రమే పరిమితమైన ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ ఆప్షన్స్ ఇపుడిక 4×4 వేరియంట్లలో కూడా లభించనున్నాయి.
థార్ 4×4 వేరియంట్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మహేంద్ర కంపెనీ ప్రకటించింది. దీంతో మహేంద్ర థార్ ఇప్పుడు మొత్తం 6 రంగుల్లో లభించనుంది. ఇప్పటివరకు ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ రంగులలో మాత్రమే అందుబాటులో ఉన్న మహేంద్ర థార్.. ఇప్పుడు ఆక్వా మెరైన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ , గెలాక్సీ గ్రే లలో లభించనుంది. ఇలా మొత్తం ఆరు రంగులలో అందుబాటులోకి రానుంది.
1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఇలా రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తున్న మహీంద్రా థార్‌కు (4X2 ) డిమాండ్ భారీగానే ఉంది. అయితే
సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ ఎస్‌యేవీలలో ఒకటి థార్. మరోవైపు మహీంద్రా కొత్త 5-డోర్ల థార్‌ను రాబోయే నెలల్లో దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 బిహెచ్‌పి ,300 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అలాగే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జోడించగా, ఇది 150 బీహెచ్‌పీని, 320 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎంట్రీ-లెవల్ ధరతో మహీంద్రా థార్ ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభం (ఎక్స్-షోరూమ్, ఇండియా).