గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇకపోతే తాజాగా నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే….హాస్పిటల్ నుంచి ఫణీంద్ర దేవయాని ఇంటికి రావడంతో ధరణి మహేంద్ర మామయ్య జగతి అత్తయ్య వాళ్ళు వస్తున్నారా వారికి ఎలా ఉంది మావయ్య అంటూ ఫణింద్రను అడుగుతుంది. వస్తున్నారని ఫణీంద్ర చెప్పగా ధరణి సంతోషిస్తుంది. అప్పుడే దేవయాని వెటకారంగా వస్తున్నారు ఇక్కడికి రాక ఎక్కడికి పోతారు అంటూ మాట్లాడుతుంది. అయినా వాళ్ళు ఎందుకు వెళ్లారు.. ఏం జరిగిందో అనే విషయాలను త్వరలోనే తెలుసుకుంటాను అంటూ ఫణింద్ర అనడంతో జగతి మహేంద్ర వాళ్ళు వెళ్లడానికి తానే కారణం అని దేవయాని వారి విషయంలో టెన్షన్ పడుతుంది.
అంతలోగా ఫణింద్రకు ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధరణి దేవయాని వంక అలా చూస్తూ ఉండిపోతుంది.ఏంటి ధరణి అలా చూస్తున్నావు అంటే జగతి అత్తయ్య వాళ్ళు వెళ్లడానికి మీరే కారణం అని తెలిస్తే ఏంటి పరిస్థితి అని అడగ్గా నేనెందుకు కారణం అయినా మనిద్దరం ఫ్రెండ్స్ కదా ఏం చెప్పకు అంటూ తనతో మంచిగా మాట్లాడుతుంది.మరోవైపు వసుధార జగతికి జ్యూస్ కలిపి తాగండి మేడం అని తాపిస్తుంది మీరు త్వరగా కోలుకోవాలని టైం కి తిని ఇలా జ్యూసులు తాగాలి అని జాగ్రత్తలు చెబుతుంది.
మనం ఏవో జరగాలని ఆరాటపడుతుంటాం కానీ కొన్నింటికి టైం రావాలి అంటూ జగతి చెప్పగా ఏంటో మేడం ఇదివరకు మీరు ఏం మాట్లాడినా మీ మనసులో ఏముందో అర్థం చేసుకునే దాన్ని ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడే మాటలు నాకేం అర్థం కావడం లేదు అంటూ సమాధానం చెబుతుంది.అయినా మీరు ఎందుకు వెళ్లిపోయారు మేడం మీ కోసం రిషి సార్ ఎంత ఆరాటపడ్డారో తెలుసా మీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలుసా అంటూ అడగగా ఇప్పుడు వాటి గురించి ఏమీ మాట్లాడవద్దు వసు అంటూ జగతి చెబుతుంది.
మేము ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఎంత బాధ పడ్డామో నీకేం తెలుసు అని జగతి బాధపడగా మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఎవరైనా పంపించారా అంటూ ప్రశ్నిస్తుంది. ఒకవేళ మహేంద్ర సార్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఇది సరైన కాదని మీరు చెప్పాలి కదా మేడం అంటూ వసు అడగగా భార్య అంటే కొన్నిసార్లు తనకు ఇష్టం లేని పనులు చేసిన భార్య వాటిని స్వీకరించాలి తెలుగులో భార్య అంటే జీవిత భాగస్వామి అర్ధాంగి అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఇవన్నీ రేపు నీకు పెళ్లి అయ్యాక అర్థమవుతాయి వసు అంటూ తనకు అన్ని విషయాలు చెబుతుంది.
నా చిన్నప్పుడు రిషి ఏం అడిగినా కాదని చెప్పేదాన్ని కాదు రిషి కోసం ఏమైనా చేసేదాన్ని. అలా ఇంటర్వ్యూ రోజు రమ్మని రిషి నాకు మెయిల్ చేస్తే రాకుండా ఉండలేకపోయాను అంటూ చెప్పడంతో ఏంటి మేడం నాకోసం రిషి సార్ మిమ్మల్ని రమ్మన్నారా.. ఈ విషయం సర్ నాకు చెప్పనేలేదు అంటూ అసలు నిజం తెలుసుకుంటుంది.నా ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉండే రిషి సార్ ఇంటర్వ్యూ రోజు నాకోసం మిమ్మల్ని రమ్మన్నారా నాకు అన్ని తానే అలాంటి రిషి సార్ ను నాకు ఇచ్చినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మేడం థాంక్యూ సో మచ్ అంటూ వసుధార మాట్లాడుతుంది.
మరోవైపు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఉండగా బిల్ మాత్రమే పే చేయాల్సి ఉంది దీంతో బిల్ పే చేసారా అంటూ రిషి అడగగా రెడీ అవుతుంది అని గౌతమ్ చెబుతాడు నా కార్డు యూస్ చేసి బిల్ పే చేయండి అని చెబుతాడు.దీంతో జగతి ఎంతో సంతోషపడుతుంది. అలాగే ఇంటికి వెళ్ళాక మేడం మీకు అవసరమైతే ఒక నర్స్ ని కూడా పిలిపిద్దాం అంటూ రిషి చెప్పగా నీకోసం నీ ఆనందం కోసం రిషి నన్ను రమ్మంటున్నాడు అని జగతి మనసులో ఆనందపడుతుంది.రిషిని చూస్తూ వెలకట్టలేని వజ్రం రిషి సార్ ఇలాంటి జెంటిల్మెన్ అసలు వదులుకోను అంటూ తాను కూడా మనసులో అనుకుంటుంది.