తమ సినిమాలపై చూపించే ప్రేమకు తగిన గుర్తింపుగా దర్శకులకు స్టార్లు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ కొన్నిసార్లు కేవలం కానుక కాదు… ఓ భావోద్వేగానికే మారిపోతాయి. ప్రముఖ తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు నటుడు సూర్య ఇచ్చిన గిఫ్ట్ అదే రేంజ్‌లో నిలిచింది. ‘సత్యం సుందరం’లాంటి హృదయాన్ని తాకే కథను తెరకెక్కించిన ప్రేమ్‌కు ఇది అద్భుత మలుపు.
ఆ సినిమా విడుదల తర్వాత, ప్రేమ్ కుమార్ తన డ్రీమ్ కారైన థార్ రాక్స్ 4×4 మోడల్‌ను కొనే యోచనలో ఉన్నాడు. అయితే తెలుపు రంగులో ఉన్న వాహనం దొరకడం కష్టంగా మారింది. సూర్య ఫ్యామిలీకి సన్నిహితుడైన రాజాను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అప్పటికి డబ్బులు కూడా వేరే అవసరాలకు వెచ్చించడంతో ఆ కలను పక్కనపెట్టాడు.
అయితే కొద్ది రోజులకే సూర్య నుంచి మెసేజ్ రావడం, అందులో ప్రేమ్ కోరుకున్న వాహన ఫోటో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఖరీదు తాను భరించలేనని చెప్పిన ప్రేమ్‌కు… ఇది సూర్య తరఫున గిఫ్ట్ అని తెలిసిన క్షణంలో మాటలే వచ్చిపోలేదు. అలా తన కలను సాకారం చేసిన స్టార్ హీరోపై ప్రేమ్‌కు ఎంత గౌరవమో అర్థమైంది.
ఇంటికి ఆ జీపు రాగానే… ఎటూ ఆలోచించకుండా 50 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన ప్రేమ్ కుమార్ ఆనందాన్ని వర్ణించలేం. ఇది కేవలం వాహనం కాదు… అతడి సినీ ప్రయాణాన్ని గుర్తించి, స్నేహం మానవత్వాన్ని చూపిన చిన్న సందేశం. కార్తీ, అరవింద్ స్వామి లాంటి నటి నటులతో ఎమోషనల్ డ్రామా అందించిన ప్రేమ్‌కు… తన కథలా తానే ఓ కథలో పాత్ర అయిపోయాడు. సూర్య చేసిన ఈ చిన్న ఉపకారం… పెద్ద మనసు చాటిన వాస్తవం.