క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరిగా మారిపోయింది . వ్యాపారం చేసే వ్యాపారవేత్తల దగ్గర నుండి వ్యవసాయం చేసే రైతుల వరకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ వల్ల ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ ని అందజేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చాలామంది అవసరం లేకున్నా కూడా దానిని ఉపయోగిస్తూ ఉంటారు. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా వాడితే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.

గడువులోగా కార్డు బిల్లు చెల్లిస్తే మేలు.. లేకపోతే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా జరిగితే భవిష్యత్ లో ఎప్పుడైనా ఋణం తీసుకోవటానికి కూడా అవకాశం ఉండదు. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గడువు ముగిసేలోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం చాలా ముఖ్యం.

క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు సమయానికి చెల్లించకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే వేరొకరికి రుణాలు ఇప్పించినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. పెండింగ్ లో ఉన్న క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా చెల్లించకుండా కేవలం మినిమమ్‌ బిల్లు చెల్లించిన కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు వడ్డీ, జీఎస్టీ, ఇతర అదనపు చార్జీలు ఛార్జీలు విధిస్తుంటాయి బ్యాంకులు. ఇలా మినిమమ్‌ బిల్లు జోలికి వెళ్లకుండా పూర్తి బిల్లు చెల్లిస్తేనే మంచిది. మనం క్రెడిట్ కార్డు నుంచి ఎంత ఖర్చు చేసిన మొత్తం బిల్లు సమయానికి చెల్లిస్తే ఎటువంటి సమస్య ఉండదు.