రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నార్తర్న్ రైల్వేలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. మొత్తం 323 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ విభాగాలతో పాటు వర్క్స్, మెకానికల్, డీజిల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పది, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2023 సంవత్సరం ఆగష్టు 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. పరీక్ష సమయం గంటన్నర కాగా 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండనుందని తెలుస్తోంది.
పార్ట్ ఎ పరీక్ష ఇలా ఉండగా పార్ట్ బి పరీక్షలో మాత్రం 60 నిమిషాల్లో 75 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. https://www.rrcnr.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
