భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. టెక్నీషియన్ ‘బి’/డ్రాఫ్ట్స్‌మెన్ ‘బి’ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. isro.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆగష్టు నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
మొత్తం 35 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా టెక్నీషియన్ ‘బి’ ఉద్యోగ ఖాళీలు 34, డ్రాఫ్ట్స్‌మన్ ‘బి’ ఉద్యోగ ఖాళీ 1 ఉంది. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ విద్యార్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇస్రో సంస్థ గతంలో కూడా పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ఇస్రో సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుద్యోగులకు మేలు చేస్తోంది.