ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)దేశ వ్యాప్తంగా విస్తరించి తన కస్టమర్లకు సేవలు అందిస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఈ స్కీమ్స్ ద్వారా కస్టమర్లు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఎస్బిఐ తమ కస్టమర్ల కోసం మరొక కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ ఎఫ్డి స్కీం ద్వారా కస్టమర్లకు అధిక ఆదాయం ఉంటుంది. ఈ ఎఫ్ డి స్కీమ్ టెన్యూర్, వడ్డీ రేటు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్‌బీఐ తాజాగా 400 రోజుల టెన్యూర్‌తో కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో చేరిన కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కీమ్ . 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుందని ఎస్బిఐ వెల్లడించింది. అంతే కాకుండా తాజాగా వడ్డీ రేట్లను పెంచేసినట్లు తెలుస్తుంది. ఎఫ్‌డీ రేట్లు 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. ఇక హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఇందుకు కారణమని చెప్పువచ్చు. ఆర్‌బీఐ రెపో రేటు పెంచటం వల్ల బ్యాంకులు కూడా క్రమంగా రుణ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇక ఇటీవల ఎస్‌బీఐ కూడా ఈ బ్యాంకుల జాబితాలోకి చేరి రుణ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు పెంచినట్లు తెలుస్తోంది.