రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ ప్రయోజనాలు పొందే అవకాశం!

మన దేశంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి తెలంగాణ సర్కార్ నుంచి తాజాగా నియమ నిబంధనలు వెల్లడి కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలో తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది.

గ్రామాల్లో వార్షిక ఆదాయం 1,50,000 రూపాయల లోపు ఉన్నవాళ్లతో పాటు పట్టణాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డ్స్ ను మంజూరు చేయనున్నారని సమాచారం అందుతోంది. రేషన్ కార్డ్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ల సంఖ్య ఏకంగా 10 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం వీళ్లలో అర్హులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందే. అదే సమయంలో వీళ్లకు ఏ రాష్ట్రంలో రేషన్ కావాలో ఎంచుకునే ఆప్షన్ ను సైతం కల్పించనున్నారు.

అదే సమయంలో రేషన్ కార్డుల ద్వారా మరింత క్వాలిటీతో ఉన్న బియ్యం అందించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. అదే సమయంలో ఏపీలో త్వరలో ఇతర రేషన్ సరుకులను అందించే దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది. కందిపప్పు, చక్కెర సబ్సిడీ ధరలకే అందించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రేషన్ కార్డ్స్ అర్హత లేకపోయినా కొంతమంది కలిగి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.