ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్..రూ. 22 లక్షల లాభం తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ..?

ప్రముఖ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసి ) తమ పాలసీల ద్వారా ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తూ తమ పాలసీదారులకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందించే ఈ పాలసీల ద్వారా ప్రజలు తమ భవిష్యత్తు కోసం డబ్బులను పొదుపు చేసి అధిక మొత్తంలో లాభాలను పొందవచ్చు. ఎల్ఐసి ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చి పాలసీదారులను ఆకట్టుకుంటూనే ఉంది.

ఇక తాజాగా ‘ధన్‌ సంచయ్‌’ పేరు తో మరొక కొత్త స్కీం ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ లో ఇన్వెష్ట్ చేసిన పాలసిదారులు అదిరే లాభాలని పొందొచ్చు. అయితే ఈ స్కీం ద్వారా మొత్తం 4 రకాల ఆప్షన్స్‌ ని అందించింది. ఇక ఈ ‘ధన్ సంచయ్’ పాలసీ పూర్తి వివరాల గురించి చూస్తే… ఈ ‘ ధన్ సంచయ్ ‘ పాలసీ తీసుకున్న వారికి లోన్‌ తో పాటు ప్రతి నెల గ్యారెంట్‌ ఇన్‌కమ్‌ వస్తుంది. A,B,C,D అనే ఆప్షన్స్‌లో ఎల్ఐసి ఈ పాలసీ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ కనుక పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారులు ఏదైనా ప్రమాదం వల్ల వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలని అందిస్తారు.

ఇక పాలసీ విషయానికి వస్తే..5 నుంచి 15 సంవత్సరాల వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. అలానే ఈ పాలసీ ని తీసుకుంటే డెత్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరడానికి పాలసీ దారుడి వయసు కనీనం మూడేళ్లు ఉండాలి. పాలసీదారులు ఒకేసారి లేదా ఐదేళ్లపాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చు. ఇక ఈ పాలసీలో నాన్-లింక్డ్, పార్టిసి పేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఏ బి సి డి అనే ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీ తీసుకుంటే ఏడాదికి కనీస ప్రీమియంగా రూ. 30,000గా ఉంది. అంతేకాకుండా 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ ప్రీమియం కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఈ పాలసీ ద్వారా కనిష్టంగా రూ. 2.5 లక్షలు, రూ. 22 లక్షల వరకు సమ్‌ అష్యూర్డ్‌ను పొందొచ్చు.