పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.20 వేల వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. 790 ఉద్యోగ ఖాళీలను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కర్నూలులోని కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

13 ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండగా అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆదిత్య ఆర్గానిక్స్ ఎకో టెక్నాలజీస్, బీ.ఎం.ఎస్ సెక్యూరిటీస్, బిగ్ బాస్కెట్, జే గ్రూప్ జోషితా ఇన్ ఫ్రా, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, రాడియంట్ సెల్ కాన్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్.కే బయో ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ చిట్స్ & లైఫ్ ఇన్సూరెన్స్, నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, అమెజాన్ వేర్ హౌస్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, సీటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్ టోగెన్ లైఫ్ సైన్స్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్, కర్నూలు, తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 20000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వాళ్లు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లను తీసుకొనిరావాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

8500783459, 8309283980, 8374376305 నంబర్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ జాబ్ మేళాకు హాజరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.