ఐడీబీఐ బ్యాంక్ లో ఏకంగా 114 ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు ఏంటంటే?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 114 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మార్చి 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ బ్యాంక్ కు సంబంధించి భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 75 ఉండగా అసిస్టెంట్ జనరల్ ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. కనీసం పదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 76 వేల రూపాయల నుంచి 84,890 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. అనుభవం ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది.

గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రకియ జరగనుంది. బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.