కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 3.5 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఎస్.ఎస్.సీ సీజీఎల్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 45,000 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా 5000 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఎస్.ఎస్.సి సీ.హెచ్.ఎస్.ఎల్ ఉద్యోగ ఖాళీలు 20,000 వరకు ఉండనున్నాయని సమాచారం.
త్వరలో ఎంటీస్ ఉద్యోగ ఖాళీలు 10,000 కంటే ఎక్కువగా రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. పది, ఇంటర్ అర్హతతోనే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఎస్.ఎస్.సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 24,000కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఇప్పుడు మాత్రమే జరుగుతోందని తెలుస్తోంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు 3.5 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రైల్వే రిక్యూట్మెంట్ బోర్డ్ నుంచి లక్షకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని బోగట్టా. ఊహించని రేంజ్ లో ఉద్యోగాల భర్తీ జరగనుండటం గమనార్హం. గ్రూప్ డీ, టీసీ, గూడ్స్ గార్డ్ ఇలా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ సైతం జరుగుతోంది.
ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ కలుగుతుంది. నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయ్వహరిస్తున్నాయి. ఐబీపీఎస్ నుంచి కూడా భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయని సమాచారం.