ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఆర్థికంగా ఎంతో ముందుకు నడిపించడం కోసం కృషి చేస్తున్నారు ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఆసరాగా ప్రతినెల పిఎం కిసాన్ సామాన్ని యోజన పథకం కింద నెలకు 6000 రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇలా ప్రతి ఏడాది ఆరువేల రూపాయలను మూడో విడతలుగా జమ చేస్తున్నారు. అలాగే కిసాన్ క్రెడిట్ స్కీం ద్వారా కేవలం నాలుగు శాతం వార్షిక వడ్డీకి రుణాలను కూడా అందిస్తుంది.
ఇలా వడ్డీలను తగ్గించే రుణాలు ఇవ్వడమే కాకుండా నెలకు 3000 రూపాయల పెన్షన్ అందించే పథకాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం 2019 వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యువజన స్కీమ్ ద్వారా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగిన రైతులందరూ కూడా ఈ పథకంలో చేరి ప్రతి నెల కాస్త నగదును జమ చేస్తూ ఉండాలి. 60 సంవత్సరాల తర్వాత రైతులు ప్రతినెల 3000 రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.
రైతుల వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు వున్నప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే… 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి.ఈ విధంగా 60 సంవత్సరాల వరకు కట్టాలి 60 సంవత్సరాలు తర్వాత ప్రతి ఒక్క రైతుకి మూడు వేల రూపాయలు నెలకు చొప్పున పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ రైతు కనక మరణిస్తే ఆయన నామినీదారులకు సగం పెన్షన్ అనగా 1500 రూపాయల పెన్షన్ పొందవచ్చు.