బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

దేశంలో ఎక్కువమంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివారనే సంగతి తెలిసిందే. బీటెక్ చదివిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరే విధంగా భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023 సంవత్సరం ఆగష్టు నెల 18వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 122 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ucil.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అనేక దశల పరీక్షలను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. సంస్థ జార్ఖండ్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.