పెళ్లి చేసుకుంటే సులువుగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశం.. ఏం చేయాలంటే?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజల కోసం పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తున్నాయి. పెళ్లి ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరేలా కొన్ని స్కీమ్స్ ను అమలులోకి తెస్తున్నాయి. తాజాగా ఝార్ఖండ్ ప్రభుత్వం ఓ విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ అవుతోంది. విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది.

భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతువులకు ప్రయోజనం చేకూర్చాలని ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా వితంతువులు 2 లక్షల రూపాయలు సులువుగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. భాగస్వామి దూరమైన వాళ్లు కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రెండో పెళ్లి చేసుకున్న వాళ్లకు సులువుగా 2 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమవుతాయి.

అర్హత కలిగి ఉండటంతో పాటు వితంతువులు అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. భర్త డెత్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయడంతో పాటు రెండో పెళ్లి రిపోర్ట్, మ్యారేజీ సర్టిఫికేట్‌ను అధికారులకు సబ్మిట్ చేయడం ద్వారా స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఏడాది లోపు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చాలామంది మహిళలు పెళ్లి తర్వాత రెండో పెళ్లిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ స్కీమ్ ద్వారా అలాంటి మహిళలలో కొంతమంది అయినా మారే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా ఈ స్కీమ్ నగదు జమ కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్థానికంగా ఉన్న అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.