భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఈ సంస్థ 10 ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలలో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 43,500 రూపాయలు వేతనంగా చెల్లించడం జరుగుతుంది. https://careers.bhel.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి మే నెల 6వ తేదీ చివరి తేదీగా ఉంది.
ఈ సంస్థ బెంగళూరు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.