ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 342 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.
2023 సంవత్సరం ఆగష్టు నెల 5వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా 2023 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) ఉద్యోగ ఖాళీలు 237 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) ఉద్యోగ ఖాళీలు 66 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) ఉద్యోగ ఖాళీలు 18 ఉండగా జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఉద్యోగ ఖాళీలు 9 ఉన్నాయి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. aai.aero వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అనేక దశల పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లక్షా 40 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలుగా ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ వయస్సు 27 సంవత్సరాలుగా ఉండనుందని తెలుస్తోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.