భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డుగా పరిగణించబడింది. ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలతో పాటు ఇతర పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉండగా ఆధార్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం ఇటీవల ఒక శుభవార్త తెలియజేసింది. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ ) కొత్త సెక్యూరిటీ సేవలను లాంచ్ చేసింది. ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ కోసం ఈ సేవలని ప్రవేశపెట్టింది.
వినియోగదారుల భద్రత కోసం విదేశీ టెక్నాలజీతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ బేస్ట్ సెక్యూరిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఫింగర్ ప్రింట్ మెమినిషియా, ఫింగర్ ఇమేజ్ ఆధారంగా ఇది పని చేస్తుంది . ఫింగర్ ప్రింట్‌ను సరిగ్గా గుర్తిస్తుంది. ఫింగర్ ప్రింట్ అనేది చనిపోయిన వాళ్లదా కాదా అనేది తెలుస్తుంది. ఫింగర్ ప్రింట్ ద్వారా జరిగే మోసపూరిత ట్రాన్సాక్షన్లను గుర్తించటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త టూ ఫ్యాక్టర్ లేదా టూ లేయర్ అథంటికేషన్ ద్వారా భద్రత ని పొందొచ్చు. 2022 డిసెంబర్ చివరి నాటికి ఆధార్ బేస్డ్ అథంటికేషన్ ట్రాన్సాక్షన్లు 88.29 బిలియన్లు దాటాయి.
దీని వల్ల ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్ కూడా బలోపేతం అవుతుందని యూఐడీఏఐ పేర్కొంది. ప్రస్తుతం రోజుకు సగటున 70 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదు అయ్యాయని యూఐడీఏఐ వెల్లడించింది. అయితే వీటిలో ఎక్కువ శాతం ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ ట్రాన్సాక్షన్లే ఉన్నాయి. యూఐడీఏఐ ఇటీవల ఏఐ లేదా ఎంఎల్ బేస్ట్ చాట్ బాట్ సర్వీసులు కూడా ప్రవేశ పెట్టింది. అదే ఆధార్ మిత్ర. ఈ ఆధార్ మిత్ర సేవల ద్వారా ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేట్, ఆధార్ పీవీసీ కార్డుల స్టేటస్ వంటి పలు రకాల సర్వీసులని అందిస్తోంది.