పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారా… ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మంచి గడియలు చూసుకొని బయలుదేరుతూ ఉంటాము. మనం చేసే ఆ మంచి పనికి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం సరేనా ముహూర్తం చూసి ఆ పని చేయడానికి బయలుదేరుస్తూ ఉంటాము. అయితే ఇలా ఏదైనా మంచి పనులు శుభకార్యాలు ప్రారంభించడానికి ముందు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఇంటి నుంచి మనం బయటకు వెళ్లేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల మన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడవు. అలాగే మనం చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతుంటారు. మరి మనం ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే…

ముందుగా మనం ఏదైనా పనులను మొత్తం బయటకు వెళ్లేటప్పుడు మనం చేసే ప్రయాణంలో ఈ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం దేవుడి గదిలో నెయ్యి దీపం వెలిగించి మన ప్రయాణంలో ఆటంకాలు రాకుండా చూడాలని నమస్కరించాలి. బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో కొట్లాటలు ఉండకూడదు. ఆ శుభం పలికే మాటలు మాట్లాడకూడదు.అలాగే ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి లోపలికి రాకుండా ముందుగానే అన్ని చూసుకొని వెళ్ళిపోవాలి. ఇక బయటకు వెళ్లే ముందు కుడికాలు ముందు బయటకు పెట్టి వెళ్లేలా చూడాలి.ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పక్షులకు లేదా జంతువులకు కాస్త ఆహారం పెట్టి వెళ్లడం మంచిది ఇక రహస్య దానం చేయడం వల్ల మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుంది. ఇక మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం కనుక ఉంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మీ ప్రయాణం చేయడం మంచిది.