రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఈ రేషన్ కార్డ్ ఉంటే రూ.425కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. కేవలం 425 రూపాయలకే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ లభించనుంది.

ఉజ్వల్ స్కీమ్ లో గ్యాస్ తీసుకున్న వాళ్లకు గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై 400 రూపాయల తగ్గింపు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గోవాలో గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై మరింత తగ్గింపు అమలవుతోంది. గోవాలో 425 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉంది. గోవా సీఎం చేసిన ఈ ప్రకటన వల్ల అక్కడి ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

అంత్యోదయ అన్నా యోజన రేషన్ కార్డులు ఉన్నవాళ్లకు ఈ నిర్ణయం ద్వారా బెనిఫిట్ కలగనుంది. గోవాలో ప్రస్తుతం 903 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సైతం ఈ తరహా స్కీమ్ లను అమలు చేస్తూ డిస్కౌంట్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత ధరల తగ్గింపు దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వినియోగదారులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.