జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్కేల్1 ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 85 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం జనవరి 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం.
gicre.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితి, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో పనితీరు,మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
200 మార్కులకు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు, మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 85000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు కావాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిది. మెరైన్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్, జియోఫిజిసిస్ట్, హైడ్రాలజిస్ట్, మెడికల్, బీమా, యాక్చువరీ, ఐటీ, ఇంజనీరింగ్, హిందీ, జనరల్, గణాంకాలు, ఎకనామిక్స్, లీగల్, హెచ్.ఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.