ఈ సింపుల్ చిట్కాలతో అందమైన గులాబి రంగు పెదాలను మీ సొంతం చేసుకోండి!

how-to-get-pink-lips-fast-and-permanently

మన అందాన్ని రెట్టింపు చేయడంలో గులాబీ రంగు పెదాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే సున్నితమైన పెదాలను రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ మార్కెట్లో దొరికే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా వినియోగిస్తే పెదాలపై ఉండే మృదువైన చర్మం తన సహజ గుణాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కావున మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి సహజ పద్ధతిలో పెదవుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీర జీవక్రియలు కూడా మార్పు చెందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా శీతాకాలం వేసవికాలంలో చర్మం, పెదాలు పొడి వారి సహజ సౌందర్యాన్ని కోల్పోయి అంద విహీనంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ఏ సీజన్లో అయినా పుష్కలంగా నీరు తాగితే మన శరీరం డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడి చర్మం పెదాలు పొడిబారడాన్ని అరికట్టవచ్చు.

ప్రకృతి సిద్ధంగా దొరికే తేనేను కలబంద గుజ్జుతో కలిపి సున్నితంగా పెదాలపై మర్దన చేసుకుంటే పెదాలపై తేమను నిలిపి సహజ మృదుత్వాన్ని కాపాడుతుంది. బీట్రూట్ ను మిశ్రమంగా చేసి పెదాలపై మర్తన చేసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే గులాబీ రంగు పెదాలు మీ సొంతమైనట్లే. చక్కెరలో బాదం ఆయిల్ మిక్స్ చేసి పగిలిన పెదాలపై స్క్రబ్ చేస్తే పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉన్న గులాబీ రేకులను పెరుగు లేదా వెన్నలో మిక్స్ చేసి పెదాలపై రాసుకుంటే సహజ అందాన్ని పెంపొందించుకోవచ్చు. రోజ్ వాటర్ లో గ్లిజరిన్ మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు సున్నితమైన పెదాలకు మర్దన చేసుకుంటే అందమైన గులాబీ రంగు పెదాలు పొందవచ్చు.