గేట్ 2024 పరీక్షకు హాజరయ్యే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురు అందించింది. గేట్ 2024 పరీక్షలో మంచి ఫలితాలను సాధించిన వాళ్లకు ఈ సంస్థ ఉద్యోగాలను అందిస్తుండటం గమనార్హం. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెక్నికల్) ఉద్యోగ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. nmdc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
గేట్ స్కోర్ ఆధారంగా దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు చేపడతాయనే సంగతి తెలిసిందే. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. మంచి గేట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు బీటెక్ తర్వాత డైరెక్ట్ గా పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే పీహెచ్డీ చేయాలని భావించే వాళ్లు ఇంటర్వ్యూను మాత్రం క్లియర్ చేయాల్సి ఉంటుంది.
ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులు విదేశాల్లో సైతం చదివే అవకాశం అయితే ఉంటుంది. మంచి స్కోర్ వచ్చిన వాళ్లు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసే ఛాన్స్ కూడా దక్కుతుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడం ద్వారా విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కూడా లభిస్తుందని చెప్పవచ్చు.
ప్రముఖ సంస్థలు ఐ.ఐ.ఎం మేనేజ్ మెంట్ లో ఐదేళ్ల ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుండగా దరఖాస్తు చేసుకున్న వాళ్లు నెలకు 30,000 రూపాయల ఫెలోషిఫ్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కు హాజరైన వాళ్లు తొమ్మిది నెలలు ఉచిత హాస్టల్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండానే ఈ పరీక్షలకు హాజరు కావచ్చు.