అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలా మంది అజీర్తి, గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నారనే సంగతి తెలిసిందే. జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతుండటం గమనార్హం. లాంటి ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడటానికి ఇంగ్లిష్‌ మందులు వాడుతుండగా సమస్య తాత్కాలికంగా తగ్గినా దీర్ఘకాలంలో ఇబ్బంది పెడుతోంది. ఈ మందులకు బదులుగా మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్‌ ఇబ్బందుల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు వాము చక్కని పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాము వలన జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ మొదలైన సమస్యలను వాము సులువుగా దూరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను వాము మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.

వామును నిమ్మరంతో కలపి తీసుకుంటే హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌ పునరుద్ధరించబడి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తరచూ గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.