మనలో చాలామందిలో భక్తి భావం ఉంటుందనే సంగతి తెలిసిందే. సంతానం కలగకపోతే కొంతమంది ఆస్పత్రుల చుట్టూ తిరిగితే కొందరు మాత్రం గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొన్ని గుళ్లకు వెళ్లి దేవుళ్లను పూజించడం ద్వారా కచ్చితంగా సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో శ్రీ దుర్గా భోగేశ్వరా స్వామి ఆలయం కూడా ఒకటి కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఆలయం ఉంది.
గడివేములలోని గడిగిరాయి గ్రామ శివార్లకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం లేనివాళ్లకు సంతానం కలగడంతో పాటు కోరిన కోరికలు తీరతాయట. సంతానం లేని వాళ్లు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు. కార్తీక మాసం సమయంలో ఈ ఆలయంలోని శివ లింగంపై సూర్య కిరణాలు పడతాయి. అందువల్ల ఈ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మరీ మంచిది.
కార్తీక పౌర్ణమి రోజు నుంచి కొన్ని రోజుల పాటు శివ లింగంపై సూర్య కిరణాలు పడతాయని స్థానికులు చెప్పుకొచ్చారు. జయ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారని సమాచారం అందుతోంది. ఈ క్షేత్రంలోని స్వామికి అభిషేకం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. సోషల్ మీడియా ద్వారా ఈ గుడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కర్నూలు, నంద్యాల నుంచి బస్ మార్గంలో గడివేముల వరకు వెళ్లే అవకాశం ఉండగా అక్కడినుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా గుడికి చేరుకోవచ్చు. కర్నూలు, నంద్యాల వరకు రైలు మార్గం కూడా ఉండగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి రైలు మార్గంలో చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.