అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారో తెలుసా.. వేసుకున్న వాళ్లు పాటించాల్సిన నియమాలివే!

మన దేశంలోని చాలామంది అయ్యప్పస్వామి భక్తులు అయ్యప్పమాల వేసుకోవడానికి ఇష్టపడతారు. కార్తీకమాసం సమయంలో భక్తులు 41 రోజుల పాటు ఈ దీక్షను పాటిస్తారు. అయ్యప్ప మాలను ధరించిన వాళ్లు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని చన్నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది.

అయ్యప్ప దీక్ష తీసుకొని ఈ విధంగా చన్నీటి స్నానం చేయడం వల్ల చిన్నచిన్న దోషాలు హరించబడి శరీరానికి మేలు జరుగుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్లు క్షవరానికి దూరంగా ఉండాలి. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్లు నల్లటి వస్త్రాలను ధరించాలి. నలుపు రంగు దుస్తులు వైరాగ్యానికి ప్రతీక కాగా చలికాలంలో కఠిన నియమాలను పాటించే వాళ్లు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా చలికాలంలో శరీరానికి వెచ్చదనం అందుతుంది.

మాల వేసుకున్న స్వాములు పరిమితంగా ఆహారం తీసుకుంటే మంచిది. కటిక నేల మీద నిద్రపోవాల్సి ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకోవడం ద్వారా అధ్యాత్మిక పురోగతి కూడా కలుగుతుంది. అయ్యప్ప మాల వేసుకునే వాళ్లు పాదరక్షలు లేకుండా నడవాల్సి ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలు రాటుదేలిపోయే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

41 రోజుల పాటు నియమాలను పాటించిన తర్వాత కేరళ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని ఇరుముడి విప్పాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామికి స్తోత్రపఠం చేయడంతో పాటు దేవతార్చన జరిపి, మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవడం ద్వారా దైవానుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు. అయ్యప్ప స్వామిని భక్తితో పూజించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.