ఘనంగా జరిగిన తొండపాడు రంగనాథ స్వామి రథోత్సవం… లక్షల సంఖ్యలో హాజరైన భక్తులు..!

సాధారణంగా మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఇంట్లో దేవాలయాలలో పూజలు చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో గ్రామ ఉత్సవాలు, రథోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా తొండపాడు లో వెలసిన బోలికొండ రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారు జామున శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి హోమాలు, ప్రతిజ్ఞ పూజలు కూడా చేశారు.

ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత అయిన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవాలయం నుంచి జమ్మి చెట్టు వరకు భక్తులందరూ స్వామివారి రథాన్ని లాగరు. ఇక అక్కడికి చేరుకున్న భక్తులు రథం పైకి అరటి పండ్లు, బెల్లం, తీపి బెండ్లు విసిరి వారి మొక్కులు తీర్చుకోవటం అనవాయితీగా వస్తోంది . ఈ రథోత్సవంలో భక్తులతో పాటు దేవాలయా ఈఓ దేవదాసు, మాణిక్య రంగనాథ స్వామి దేవాలయ ధర్మకర్త మకాం శ్రీకాంత, కమిటీ చైర్మన్ రామాంజి రాయల్,మన్రో సత్రం, మాజీ చైర్మన్ రాము రాయల్ తహసిల్దార్ మహబూబ్ బాషా కూడా పాల్గొన్నారు.

ఈ రథోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఈ రథోత్సవంలో ఎద్దుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజులపాటు జరుపుకొని ఈ రథోత్సవాన్ని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రథోత్సవంలో ఎటువంటి అనవాచిత చర్యలు జరగకుండా పటిష్టమైన భద్రత కల్పించారు. సిఐ వెంకట్రామిరెడ్డి దగ్గరుండి భద్రతా చర్యలను పర్యవేక్షించాడు. రథోత్సవంలో ఎటువంటి గొడవలు కలహాలు జరగకుండా భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రథోత్సవంలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏడాదికి ఒకసారి దొండపాడు లో జరిగే ఈ రథోత్సవ మహోత్సవాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తరలివచ్చారు.