ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలు పొందే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తెగ సంతోషిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని కలలు కంటున్నారు. 900 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఇంటర్ పాసైన విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఇంటర్ అర్హతతో పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు సంపాదించాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ ఉద్యోగాలతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వెబ్ డిజైనింగ్ కోర్సులు జాయిన్ కావడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మొత్తం సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకుర్చుతుందని చెప్పవచ్చు.

ఈ కోర్సు వల్ల ప్రముఖ కంపెనీలలో సైతం సులువుగా ఉద్యోగం సంపాదించవచ్చు. వెబ్ సైట్లు, యూట్యూబ్ కు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ కోర్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు చేయడం ద్వారా కూడా సులభంగా ఉద్యోగం పొందవచ్చు. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు 5 లక్షల కంటే ఎక్కువ వేతనం లభిస్తుంది.

ప్రముఖ నగరాలు, పట్టణాలలో ఉద్యోగం చేయడం ద్వారా ఈ ఉద్యోగానికి సులభంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్ అర్హతతో చదువు ఆపేసే విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు