కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా…ఈ చిట్కాలు మీ కోసమే?

ఈరోజుల్లో కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు సర్వసాధారణంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కారణాలను పరిశీలిస్తే ఏ పని చేయకుండా ఒకే చోట కూర్చున్న వారిలోనూ, అధిక శారీరక శ్రమ కలిగిన వారిలోనూ కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకొందరిలో అనారోగ్య కారణాలు, వ్యాయామాలు ఎక్కువగా చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా శీతాకాలంలో కండరాలు బిగుసుకుపోవడం రక్త ప్రసరణ తగ్గి కండరాలు పట్టేయడం వల్ల ఒళ్ళు నొప్పుల సమస్య ఎక్కువగానే ఉంటుంది అలాంటప్పుడు కంగారు పడకుండా ఇష్టం వచ్చిన మందులను చేసుకోవడం మానేసి సహజ పద్ధతిలో కండరాల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సమస్య మరి తీవ్రంగా ఉంటే అప్పుడు కచ్చితంగా వైద్య సలహాలను పాటించాలి. ఇంటి దగ్గరే సహజ పద్ధతులు ఒళ్ళు నొప్పుల సమస్యలను తగ్గించుకోవాలంటే స్ట్రెచింగ్ చేయడమే ఉత్తమ పరిష్కారం.

ఎక్కువసేపు కూర్చున్న వారిలోనూ, ఎక్కువ శారీరక శ్రమ చేసిన,వ్యాయామం చేసినప్పుడు, కండరాలు కొంత ఒత్తిడికి గురైతాయి కావున కండరాల నొప్పులు, వాపు వంటి సమస్య తలెత్తుతుంది. అలాంటప్పుడు రిలాక్స్ గా మన శరీరాన్ని స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుడి తక్షణం ఉపశమనం పొందవచ్చు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఔషధ గుణాలున్న ఆవనూనెను ఉపయోగించవచ్చు. నొప్పి ఉన్న కండరాలపై గోరువెచ్చని ఆవనూనెతో సున్నితంగా మసాజ్ చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.