శ్వాస సంబంధ వ్యాధుల్లో ఒకటైన ఆస్తమా సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం మన వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం అనే చెప్పొచ్చు. ఇంకొందరిలో జన్యుపరమైన కారణాలు కూడా కారణం కావచ్చు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం నిర్ణయించబడుతుంది కావున ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. ప్రతిరోజు మన జీవక్రియలకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించినప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే ఆస్తమా సమస్యకు కూడా చెక్ పెట్టాలంటే మన ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చలికాలంలో ఆస్తమా సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కావున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నోళ్లు వారి రోజువారి ఆహారంలో మునగ, క్యారెట్, చిలకడదుంప, బొప్పాయి వంటి బీటాకేరోటి, మరియు మిటమిన్ సి అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అత్యధిక విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న యాపిల్ పండును, స్ట్రాబెరీ, బత్తాయి వంటి పండ్లను మన రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ తగ్గి ఆస్తమా సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ పండ్ల రసాలను లేదా పండ్లను ఫ్రిజ్లో ఉంచి అధిక చల్లదనం ఉన్నప్పుడు ఆహారంగా తీసుకుంటే ఆస్తమా సమస్య మరింత తీవ్రతమవుతుంది ఇది గుర్తుంచుకోవాలి.
ఆస్తమా సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు వీరి ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉన్న చియా గింజలు, రాగులు, కొర్రలు,గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్, బ్రోకలీ, బ్రౌన్ రైస్, పచ్చి బఠానీ, పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే విటమిన్ డి పుష్కలంగా ఉన్న చేపలు, గుడ్లు, పాలు వంటి ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు సిట్రిక్ యాసిడ్ అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. యాంటీ మైక్రోబియన్ గుణాలున్న తులసి, అల్లం, తేనె కలిపి నటువంటి పానీయాలను ప్రతిరోజు తీసుకోవడం మంచిదే.