మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఎక్కిళ్ల వల్ల ఇబ్బందులు పడే ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎక్కిళ్లు సమస్య చిన్న సమస్యే అయినప్పటికీ ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మన శరీరంలో ఉండే డయాఫ్రమ్ అనే కండరం అస్వస్థతకు గురైన సమయంలో మనకు ఎక్కిళ్లు వస్తాయి.
వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా పొట్టలో గాలి చేరి ఎక్కిళ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నెమ్మదిగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బాగా ఆకలిగా ఉన్న సమయంలో ఆహారం తీసుకుంటే కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మసాలా దినుసులు ఎక్కువగా వేసిన ఆహారం తీసుకున్నా ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కువగా ధూమపానం చేసేవాళ్లను సైతం ఈ సమస్య వేధిస్తుంది.
సోడా, బీర్ లాంటి పానీయాలు తాగడంతో పాటు మానసిక ఆందోళన, ఒత్తిడి, మనోవేదనకు గురయ్యే వాళ్లను సైతం ఎక్కిళ్లు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కిళ్లు వచ్చిన సమయంలో కొన్ని సెకన్ల పాటు శ్వాస బిగపట్టడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. డీప్ గా శ్వాస తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. చల్లటి నీరు తాగడం లేదా ముఖం కడగడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
బెల్లం, షుగర్ వంటి చక్కెర పదార్థాలను నెమ్మదిగా నమలడం ద్వారా కూడా ఎక్కిళ్ల సమస్య దూరమవుతుంది. చెంచా బియ్యం తినడం ద్వార కూడ ఎక్కిళ్లు తగ్గుతాయి. వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకోవడంతో పాటు లెమన్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కిళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెప్పవచ్చు.