మీ పిల్లల చేతులకు ఫెవిక్విక్ అంటుకుందా.. ఈ చిట్కాలతో ఆ సమస్యలకు చెక్!

ప్రస్తుత కాలంలో ఫెవిక్విక్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫెవిక్విక్ ను వినియోగిస్తున్నారు. అయితే చేతికి ఫెవిక్విక్ అంటుకుంటే వదిలించుకోవడం సులువు కాదు. చేతికి ఫెవిక్విక్ అలానే అంటుకుని ఉండటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చేతులకు ఉన్న ఫెవిక్విక్ ను సులువుగా వదిలించుకునే అవకాశాలు ఉంటాయి.

ఫెవిక్విక్ చేతులకు అంటుకుంటే ఉప్పు సహాయంతో ఆ ఫెవిక్విక్ ను సులువుగా తొలగించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వేడి నీళ్లను అప్లై చేయడం ద్వారా కూడా ఫెవిక్విక్ ను తొలగించుకోవచ్చు. శాంపూను అప్లై చేయడం ద్వారా కూడా ఫెవిక్విక్ ను తొలగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా చర్మానికి ఏ మాత్రం డ్యామేజ్ జరగకుండా ఫెవిక్విక్ ను రిమూవ్ చేసుకోవచ్చు.

బేకింగ్ సోడా సహాయంతో కూడా ఫెవిక్విక్ ను రిమూవ్ చేసుకోవచ్చు. హ్యాండ్ శానిటైజర్ ను ఫెవిక్విక్ పడిన చోట అప్లై చేయడం ద్వారా కూడా దానిని రిమూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫెవిక్వెక్ ను ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఫెవిక్విక్ పొరపాటున కంట్లో పడే అవకాశాలు ఉంటుంది. చల్లని నీళ్లతో కంటిని తడిపి కాటన్ క్లాత్ తో తుడిచేయాలి.

ఆ తర్వాత వైద్యులను సంప్రదించి ఐ డ్రాప్స్ ను వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే మాత్రం కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒకవేళ కంటిలో ఫెవిక్విక్ పడినా ఆ సమస్యను సులువుగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.