మెంతులు తీసుకోవడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్.. బరువు తగ్గడంతో పాటు షుగర్ కంట్రోల్!

మనలో చాలామంది వంటకాల తయారీలో మెంతులు కచ్చితంగా ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. అందరి వంట గదిలో కనిపించే వస్తువుల్లో మెంతులు కూడా ఒకటి కాగా ఆరోగ్యానికి, అందానికి మెంతుల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయుర్వేదంలో ఔషధంగా కూడా మెంతులను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. మెంతులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పొటాషియం, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, డైటరీ ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, రైబోఫ్లావిన్‌ లభిస్తాయి.

మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గడానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. మెంతులు రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రించడంలో తోడ్పడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. శరీరం పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదింపజేసి రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేయడంలో ఇవి తోడ్పడతాయని చెప్పవచ్చు.

మెంతుల్లో 4 హైడ్రాక్సిస్‌ల్యూసిన్‌ అనే అమైనో ఆల్కనాయిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంతో పాటు కణాలు ఇన్సులిన్‌ను తీసుకునేలా చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మెంతులు తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్‌, కడుపు ఉబ్బరం కచ్చితంగా దూరమవుతాయని చెప్పవచ్చు. మలబద్ధకం సమస్య కూడా మెంతుల వల్ల దూరమవుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా అదుపులో ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక బరువుతో బాధపడేవారు ఉదయాన్నే నానబెట్టిన మెంతి గింజలను గోరువెచ్చని నీటితో పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మెంతులు మేలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మెంతులు ఆకలిని తగ్గించడానికి, ఆహారం తీసుకోవడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

బాలింతలు మెంతులను తీసుకొంటే పాలు బాగా పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఫైటోఈస్టోజ్రెన్‌ పాలను పెంచడంతోపాటు బిడ్డ బరువు పెరిగేలా చేయడంలో తోడ్పడుతుంది. మెంతులను పొడిగా చేసి కొద్దిగా నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీసీఓడీ సమస్యతో బాధ పడే మహిళలకు మెంతులు ఉపయోగపడతాయి.