ఫ్యాషన్ షో అనగానే అవి మహా నగరాలకే పరిమితం అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ షో లు మహా నగరాలు, నగరాల స్థాయి దాటి పట్టణాలకు కూడా పాకిపోయాయి. ఫ్యాషన్ షో అనేది విదేశీ సంస్కృతి అని భారతీయు గతంలో ఈసడించుకునేవారు. ఒక దశలో ఇండియాలో ఫ్యాషన్ షో లు జరగనివ్వకూడదని ఆందోళనలు, ఉద్యమాలు సాగిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా సిద్ధిపేటలో ఫ్యాషన్ షో స్థానికులను ఆకట్టుకుంది. p 6 news ఛానెల్ లో ఆ వీడియోను పోస్టు చేశారు.
గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఎక్కడి సంస్కృతి అయినా ప్రపంచమంతా పాకిపోయింది. ఇదే తరుణంలో భారతీయ నగరాల్లోకి ఫ్యాషన్ షో లు ఎంటరయ్యాయి. ముంబై ఫ్యాషన్ షో లకు పెట్టింది పేరు. ఆ తర్వాత మిగతా నగరాల్లో కూడా ఫ్యాషన్ ప్రపంచం విస్తరించింది. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు వచ్చాయి. వస్త్ర ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు మోడళ్లను ముస్తాబు చేసి ఫ్యాషన్ షో లో పరేడ్ చేయిస్తారు.
తాజాగా ఫ్యాషన్ షో సిద్ధిపేటకు కూడా పాకింది. సిద్ధిపేట పట్టణంలో జరిగిన ఫ్యాషన్ షో లో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు వివిధ రకాల వస్త్రాలు ధరించి ర్యాంపు మీద క్యాట్ వాక్ చేశారు. ఈ షో చూసేందుకు కాలేజీ స్టూడెంట్స్ ఎగబడ్డారు. క్యాట్ వాక్ చేస్తున్న సమయంలో ఈలలు కేకలతో ఎంజాయ్ చేశారు. సిద్ధిపేట ఫ్యాషన్ షో తాలూకు ఫుల్ వీడియో కింద ఉంది చూడొచ్చు.