ఎల్ఐసీలో అద్భుతమైన పాలసీ.. రూ.138 పెట్టుబడితో రూ.23 లక్షలు పొందే ఛాన్స్!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా అనుకోని పరిస్థితులు సంభవిస్తే ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం ఉంది. రోజుకు 138 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టడం వల్ల ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 23 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కచ్చితమైన హామీ ఉంటుంది కాబట్టి ఎల్ఐసీ పాలసీలు ప్రయోజనకరంగా ఉంటాయి.

ఎల్ఐసీ బీమా రత్న పాలసీ తీసుకున్న వాళ్లు రోజుకు 138 రూపాయల చొప్పున పొదుపు చేస్తి మెచ్యూరిటీ సమయంలో 23 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీకి కనీస మొత్తం 5 లక్షల రూపాయలుగా ఉంది. పాలసీ టర్మ్ 15 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వరకు ఉంది. పాలసీ తీసుకునే సమయం కంటే 4 లేదా 5 సంవత్సరాలు తక్కువగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

10 లక్షల రూపాయల కోసం పాలసీ తీసుకుంటే 20 సంవత్సరాల ప్లాన్ తీసుకుంటే మంచిది. పాలసీదారుడు మరణిస్తే మాత్రం 12.5 లక్షలు పొందే అవకాశం ఉండటంతో పాటు 10 లక్షల రూపాయల పాలసీ సొమ్ము పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారులు ఈ స్కీమ్ లో చేరడం ద్వారా సర్వైవల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ప్రాథమిక హామీ పొందే అవకాశం ఉంటుంది.

ఎల్ఐసీ పాలసీలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. పొదుపును ఇష్టపడే వాళ్లు ఎల్ఐసీ పాలసీలను ఎంచుకుంటే మంచిది. కుటుంబానికి ఆర్థిక భరోసా అందించే విషయంలో ఈ పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది.