పెట్రోల్, వాటర్, పాల ట్యాంకర్లు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

సాధారణంగా మనకు నిత్యవసర సరుకులలో ఎంతో ముఖ్యమైన వాటిలో పెట్రోల్ వాటర్ పాలు కూడా ఒకటి. అయితే వీటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం సర్వసాధారణం కానీ పెట్రోల్ వాటర్ ఫాలో ట్యాంకర్లు మాత్రం ఎప్పుడూ కూడా గుండ్రంగానే ఉంటాయి.అయితే ఇలా ఈ మూడు ట్యాంకర్లు ఎందుకు గుండ్రంగా ఉంటాయి అలా ఉండడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా…మరి పాల టాంకర్లు వాటర్ పెట్రోల్ ట్యాంకర్లు ఎందుకు గుండ్రంగా ఉంటాయి దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

పాలు పెట్రోల్ నీళ్లు ఇవన్నీ కూడా ద్రవపదార్థాలే. ఇలా ద్రవపదార్థాలను ఎప్పుడూ కూడా గుండ్రంగా ఉన్నటువంటి ట్యాంకర్లలో మాత్రమే తరలిస్తూ ఉంటారు.ఈ ద్రవ పదార్థాలను కేవలం గుండెని ఆకారంలో ఉన్నటువంటి వాహనాలలోనే ఎందుకు తరలిస్తారో ఇతర వాహనాలలో ఎందుకు తరలించారు అనే విషయంలో కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్ దాగి ఉంది.ఇలాంటి దవ్వ పదార్థాలను గుండ్రటి వాహనాలలో సరఫరా చేయటం వల్ల ఎక్కువ మొత్తంలో సరఫరా చేయవచ్చు. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది.

మనం దేనిలోనైనా ద్రవాన్ని ఉంచినప్పుడు, పదార్థం ఒత్తిడిని సృష్టిస్తుందని, దాని కారణంగా మూలల ద్వారా శక్తి ప్రయోగితమవుతుందని సైన్స్ చెబుతోంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, ట్యాంకర్ గుండ్రని ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉంటే, దాని లైఫ్ టైమ్ గణనీయంగా తగ్గుతుంది. ట్యాంకర్ మూలలు ఒత్తిడి కారణంగా త్వరగా పాడవుతాయి, అయితే గుండ్రని ట్యాంకర్‌లో మూలలు లేనందున ఒత్తిడిని ప్రయోగించినప్పుడు ద్రవం బయటకు వచ్చే అవకాశం ఉండదు కనుక ద్రవపదార్థాలను ఎప్పుడూ కూడా ఇలాంటి గుండ్రటి టాంకర్లలో తరలిస్తారు.