ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. esic.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు స్పెషలిస్ట్- ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2024 సంవత్సరం మార్చి నెల 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. హర్యానాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ సూపరింటెండెంట్ రూమ్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర సందేహాలను సంబంధిత వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 1,27,000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది.