రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఎవరూ వదులుకోరనే సంగతి తెలిసిందే. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం కొసమెరుపు. esic.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కర్ణాటకలోని కలబురగిలో ఉన్న మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో 22 స్థానాల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా ఆగస్టు 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 16 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రొఫెసర్ల ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 211,878 రూపాయలు వేతనంగా లభిస్తుండగా అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు 140,894 రూపాయలు వేతనం లభిస్తుంది.

https://www.esic.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజున అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.